Presidential Election: రబ్బర్‌స్టాంప్‌ అన్న పేరెలా వచ్చింది?

రాష్ట్రపతి పదవి రబ్బర్‌స్టాంప్‌ వంటిదన్న పేరు చిరకాలంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు ఆమోదముద్ర వేయడం తప్ప ప్రత్యేక అధికారాలు ఏమీ లేవన్న ఉద్దేశంతో ఇలాంటి అభిప్రాయం ఏర్పడింది.

Updated : 03 Jul 2022 08:39 IST

రాష్ట్రపతి పదవి రబ్బర్‌స్టాంప్‌ వంటిదన్న పేరు చిరకాలంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు ఆమోదముద్ర వేయడం తప్ప ప్రత్యేక అధికారాలు ఏమీ లేవన్న ఉద్దేశంతో ఇలాంటి అభిప్రాయం ఏర్పడింది. రాష్ట్రపతులుగా బాబూ రాజేంద్ర ప్రసాద్‌, సర్వేపల్లి రాధాకృష్ణన్‌, జాకీర్‌ హుసేన్‌, వి.వి.గిరి హయాముల్లో ఇలాంటి వాదన వినిపించలేదు. అనంతరం ఫకృద్దీన్‌ అలీ అహ్మద్‌ హయాంలో ఈ పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. అప్పట్లో ఇందిరాగాంధీ ప్రభుత్వం వివిధ అంశాలకు సంబంధించి తరచూ ఆర్డినెన్స్‌లను జారీ చేసేది. విధి నిర్వహణలో భాగంగా వాటిని రాష్ట్రపతి ఆమోదించేవారు. 1975 జూన్‌లో నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం దేశంలో అత్యయిక పరిస్థితిని విధించింది. ఈ నిర్ణయానికి ఆమోదం కోసం ఆమెతో పాటు, నాటి న్యాయశాఖ మంత్రి సిద్ధార్థ శంకర్‌ రే రాష్ట్రపతి ఫకృద్దీన్‌ అలీ అహ్మద్‌ను కలిశారు. దేశ భవితవ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే ఇలాంటి కీలక అంశాలపై రాష్ట్రపతి ఆచితూచి వ్యవహరించాలి. అనేక కోణాల్లో విస్తృతంగా ఆలోచించాలి. న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలి. తనకు గల సందేహాలపై ప్రభుత్వం నుంచి వివరణ తీసుకోవాలి. గతంలో న్యాయవాదిగా, అస్సాం ప్రభుత్వంలో అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ)గా కూడా పనిచేసిన ఆయన ఈ విషయాల గురించి ఏమీ ఆలోచించలేదు. ఇందిరాగాంధీ పట్ల ఉన్న విధేయతతో అత్యయిక పరిస్థితి ప్రకటనపై సంతకం చేశారు. ఆ తర్వాత ఈ నిర్ణయం దేశాన్ని కుదిపేసింది. అప్పటి నుంచి రాష్ట్రపతి రబ్బర్‌స్టాంప్‌ అన్న అభిప్రాయం బలపడిపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు