చలనం లేని దేహం.. చెదరని సంకల్పం: ఆన్‌లైన్‌ పాఠాలతో న్యాయవాది కొత్తజీవితం

రోడ్డు ప్రమాదానికి గురైన ఓ న్యాయవాది 95 శాతం దేహ చలనాన్ని కోల్పోయారు. అదే ప్రమాదంలో కుమార్తెను కూడా పోగొట్టుకోవడం వల్ల కుంగిపోయారు. ఈ దశలో తాను నేర్చుకున్న విద్యతో వాటిని అధిగమించి, పిల్లలకు పాఠాలు చెబుతూ కొత్తజీవితం

Updated : 21 Jul 2022 07:06 IST

రోడ్డు ప్రమాదానికి గురైన ఓ న్యాయవాది 95 శాతం దేహ చలనాన్ని కోల్పోయారు. అదే ప్రమాదంలో కుమార్తెను కూడా పోగొట్టుకోవడం వల్ల కుంగిపోయారు. ఈ దశలో తాను నేర్చుకున్న విద్యతో వాటిని అధిగమించి, పిల్లలకు పాఠాలు చెబుతూ కొత్తజీవితం ప్రారంభించారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ వద్ద పిసాదేవి ప్రాంతంలో నివసిస్తున్న ఆయన పేరు ఉదయ్‌ చవాన్‌. 2019లో జరిగిన ప్రమాదం ఉదయ్‌ చవాన్‌ జీవితాన్ని తలకిందులు చేసింది. అయినా తానే ఆధారమైన కుటుంబానికి ఓ దారి చూపించాలనుకున్నారు. స్నేహితుల ఆర్థికసాయంతో శస్త్రచికిత్స పూర్తి చేసుకున్నాక.. పిల్లలకు ట్యూషన్లు చెబుదామన్న ఆలోచన వచ్చింది. ప్రమాదానికి ముందువరకు ఉచితంగా స్పోకెన్‌ ఇంగ్లిష్‌ నేర్పిన ఆయన పరిస్థితిని స్థానికులు సైతం అర్థం చేసుకున్నారు. డబ్బులిచ్చి తమ పిల్లలను ట్యూషనుకు పంపారు. ప్రస్తుతం ఆన్‌లైనులో, ఆఫ్‌లైనులో నడుస్తున్న ట్యూషన్లతో ఉదయ్‌ చవాన్‌ మళ్లీ బిజీ అయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని