Booster Dose: బూస్టర్‌డోస్‌ తీసుకుంటే.. ఛోలే భటూరే ఉచితం

ఛాట్‌ బండిని నడుపుకొంటూ సైకిల్‌పై ఛోలే భటూరేను విక్రయించే చిరు వ్యాపారి ఆయన. కొవిడ్‌ బూస్టర్‌ డోసును ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్నా, దాన్ని తీసుకోవడంలో ప్రజలు ఉదాసీనంగా వ్యవహరిస్తుండటం ఆయన్ను ఆలోచింపజేసింది.

Updated : 01 Aug 2022 09:19 IST

చండీగఢ్‌ వీధి వ్యాపారి ప్రకటన

చండీగఢ్‌: ఛాట్‌ బండిని నడుపుకొంటూ సైకిల్‌పై ఛోలే భటూరేను విక్రయించే చిరు వ్యాపారి ఆయన. కొవిడ్‌ బూస్టర్‌ డోసును ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్నా, దాన్ని తీసుకోవడంలో ప్రజలు ఉదాసీనంగా వ్యవహరిస్తుండటం ఆయన్ను ఆలోచింపజేసింది. టీకాను తీసుకునేలా వారిని ప్రోత్సహించడానికి తన వంతు ప్రయత్నం చేయాలనుకున్నారు. బూస్టర్‌ డోసు తీసుకున్నట్లు ఆధారాలు చూపినవారికి ఛోలే భటూరేను ఉచితంగా అందిస్తానని ప్రకటించారు. ఆయనే హరియాణాలోని చండీగఢ్‌కు చెందిన సంజయ్‌ రాణా. ఈయన గతేడాది కూడా కొవిడ్‌ టీకా రెండు డోసులూ తీసుకున్నవారికి ఛోలే భటూరేను ఉచితంగా అందించారు. సుమారు ఏడు నెలలపాటు దాన్ని కొనసాగించారు. దీని గురించి తెలుసుకున్న ప్రధాని మోదీ ‘మన్‌ కీ బాత్‌’ రేడియో కార్యక్రమంలో ఆయన్ను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇప్పుడు కొన్ని వారాలపాటు ఉచితంగా ఛోలే భటూరేను అందించనున్నట్లు రాణా తెలిపారు. దేశంలో మళ్లీ కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయని, దీన్ని దృష్టిలో పెట్టుకొని అర్హులైన ప్రతి ఒక్కరూ బూస్టర్‌ డోసు తీసుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని