పాక్‌ ‘మైనారిటీ’ వైద్యులకు భారత్‌లో ప్రాక్టీసుకు అవకాశం

వేధింపుల కారణంగా పాక్‌ను విడిచి.. 2014 డిసెంబరు 31 లేదా అంతకుముందు భారత్‌కు తరలివచ్చిన మైనారిటీ వర్గాల వైద్యులకు ఇక్కడ అలోపతి వైద్యం చేయడానికి అనుమతించాలని జాతీయ వైద్య

Published : 07 Aug 2022 05:13 IST

దిల్లీ: వేధింపుల కారణంగా పాక్‌ను విడిచి.. 2014 డిసెంబరు 31 లేదా అంతకుముందు భారత్‌కు తరలివచ్చిన మైనారిటీ వర్గాల వైద్యులకు ఇక్కడ అలోపతి వైద్యం చేయడానికి అనుమతించాలని జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) నిర్ణయించింది. పాకిస్థాన్‌లో ధ్రువీకృత వైద్యవిద్య కోర్సులో ఉత్తీర్ణులై.. డాక్టర్లుగా ప్రాక్టీస్‌ చేసి భారత్‌కు వలస వచ్చి పౌరసత్వం పొందినవారు అర్హులని తెలిపింది. ఇందుకు గాను సెప్టెంబరు 5 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఎన్‌ఎంసీకి చెందిన అండర్‌ గ్రాడ్యుయేట్‌ ఎడ్యుకేషన్‌ బోర్డు ప్రకటన ఇచ్చింది. ఈమేరకు నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి అలోపతి వైద్యం చేయడానికి శాశ్వత రిజిస్ట్రేషన్‌ మంజూరవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని