‘సీఎస్‌ఐఆర్‌’ తొలి మహిళా డైరెక్టరుగా సీనియర్‌ శాస్త్రవేత్త కలైసెల్వి

తమిళనాడుకు చెందిన సీనియర్‌ సైంటిస్టు నల్లతండి కలైసెల్వి ‘కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చి’ (సీఎస్‌ఐఆర్‌) మొదటి మహిళా డైరెక్టరుగా నియమితులయ్యారు.

Published : 08 Aug 2022 05:49 IST

విల్లివాక్కం, న్యూస్‌టుడే: తమిళనాడుకు చెందిన సీనియర్‌ సైంటిస్టు నల్లతండి కలైసెల్వి ‘కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చి’ (సీఎస్‌ఐఆర్‌) మొదటి మహిళా డైరెక్టరుగా నియమితులయ్యారు. లిథియం అయాన్‌ బ్యాటరీ రంగంలో ఆమె చేసిన పరిశోధనలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ పదవిలో నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె సీఎస్‌ఐఆర్‌ సెక్రటరీగా కూడా వ్యవహరిస్తారు. 2019 ఫిబ్రవరిలో ‘సెంట్రల్‌ ఎలక్ట్రోకెమికల్‌ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌’ (సీఎస్‌ఐఆర్‌ - సీఈసీఆర్‌ఐ)లో తొలి మహిళా సైంటిస్టు ఆమే కావడం గమనార్హం. అదే ఇన్‌స్టిట్యూట్‌లో ఆమె పరిశోధకురాలిగా ప్రవేశించారు. తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాకు చెందిన అంబాసముద్రం కలైసెల్వి స్వస్థలం. ఎలక్ట్రో కెమికల్‌ పవర్‌ సిస్టమ్స్‌పై పాతికేళ్ల పాటు పరిశోధనలు చేశారు. ప్రస్తుతం వయబుల్‌ సోడియం లిథియం సల్ఫర్‌ బ్యాటరీ, సూపర్‌ కెపాసిటర్ల అభివృద్ధిపై దృష్టి సారించారు. నేషనల్‌ మిషన్‌ ఫర్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీకి కూడా తనవంతు సేవలందించారు. 125 రకాల పరిశోధనలు చేసిన ఘనత ఆమె సొంతం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని