తదుపరి సీజేఐ జస్టిస్‌ యు.యు.లలిత్‌

సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ యు.యు.లలిత్‌ నియమితులయ్యారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 124(2) కింద ఉన్న అధికారాలను అనుసరించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నెల 27వ తేదీ నుంచి జస్టిస్‌ లలిత్‌ను భారత ప్రధాన

Updated : 11 Aug 2022 05:04 IST

 నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు

ఈనాడు, దిల్లీ: సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ యు.యు.లలిత్‌ నియమితులయ్యారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 124(2) కింద ఉన్న అధికారాలను అనుసరించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నెల 27వ తేదీ నుంచి జస్టిస్‌ లలిత్‌ను భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమించినట్లు కేంద్ర న్యాయశాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పదవీకాలం ఈ నెల 26వ తేదీతో ముగుస్తుండడంతో 27 నుంచి ఆ స్థానంలో జస్టిస్‌ లలిత్‌ బాధ్యతలు చేపడతారు. నవంబరు 8వ తేదీ వరకు ఆయన పదవిలో ఉంటారు. 1957 నవంబరు 9న జన్మించిన యు.యు.లలిత్‌ బాంబే హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా సేవలందించారు.

నేరుగా బార్‌ నుంచే 2014 ఆగస్టు 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. మరోవైపు, జస్టిస్‌ యు.యు.లలిత్‌కు సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అభినందనలు తెలిపారు. బార్‌, బెంచ్‌లో ఉన్న సుదీర్ఘ అనుభవం, సమర్థవంతమైన నాయకత్వంతో జస్టిస్‌ లలిత్‌ న్యాయవ్యవస్థను కొత్త శిఖరాలకు తీసుకెళతారని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. సీజేఐగా ఆయన పదవీకాలం అద్భుతంగా సాగాలని ఆకాంక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని