వీర్‌ గాథ విజేతలను సన్మానించిన రాజ్‌నాథ్‌

సాయుధ బలగాల్లో పనిచేసే సిబ్బంది సాహసోపేతమైన పనుల గురించి అవగాహన కల్పించడమే లక్ష్యంగా నిర్వహించిన సాహిత్య పోటీ ‘వీర్‌ గాథ’ పోటీల్లో విజేతలుగా నిలిచిన 25 మంది విద్యార్థులను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శుక్రవారం

Published : 13 Aug 2022 05:53 IST

దిల్లీ: సాయుధ బలగాల్లో పనిచేసే సిబ్బంది సాహసోపేతమైన పనుల గురించి అవగాహన కల్పించడమే లక్ష్యంగా నిర్వహించిన సాహిత్య పోటీ ‘వీర్‌ గాథ’ పోటీల్లో విజేతలుగా నిలిచిన 25 మంది విద్యార్థులను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శుక్రవారం సన్మానించారు. దేశవ్యాప్తంగా 4,788 పాఠశాలల నుంచి 8.04 లక్షల మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. వీరు పద్యాలు, చిత్రాలు, మల్టీమీడియా ప్రజంటేషన్లు, వ్యాసాలు తదితర రూపాల్లో స్ఫూర్తిమంతమైన కథనాలను సమర్పించారని రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. గతేడాది అక్టోబరు 21, నవంబరు 20 తేదీల్లో నిర్వహించిన ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థుల్లో 25 మంది అనేక దశల మూల్యాంకనం తర్వాత ‘సూపర్‌-25’గా ఎంపిక చేశామన్నారు. శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ 25 మందిని రూ.10,000 చొప్పున నగదు, పతకం, ధ్రువీకరణ పత్రంతో సన్మానించారు. వాయుసేన అధిపతి ఎయిర్‌చీఫ్‌ మార్షల్‌ వి.ఆర్‌.చౌధరి, నౌకాదళాధిపతి అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌, వైస్‌ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ బి.ఎస్‌.రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని