19 ఏళ్లుగా జైలులో ఉన్న వ్యక్తి విడుదలకు సుప్రీంకోర్టు ఆదేశం

ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడి, ఆమెను హత్య చేసిన కేసులో దాదాపు 19 ఏళ్లుగా జైలులో ఉన్న ఓ వ్యక్తిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నేరానికి పాల్పడిననాటికి అతడు మైనరేనని, సంబంధిత చట్టం ప్రకారం మైనర్లను మూడేళ్లకు మించి నిర్బంధంలో ఉంచడానికి వీల్లేదని జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌లతో

Published : 14 Aug 2022 05:52 IST

నేరం జరిగినప్పుడు మైనరేనని స్పష్టీకరణ

దిల్లీ: ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడి, ఆమెను హత్య చేసిన కేసులో దాదాపు 19 ఏళ్లుగా జైలులో ఉన్న ఓ వ్యక్తిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నేరానికి పాల్పడిననాటికి అతడు మైనరేనని, సంబంధిత చట్టం ప్రకారం మైనర్లను మూడేళ్లకు మించి నిర్బంధంలో ఉంచడానికి వీల్లేదని జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. వ్యక్తిగత పూచీకత్తుపై అతనికి వెంటనే మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయాలని ఆదేశించింది. దిగువ కోర్టు అతనికి 2003లో మరణశిక్ష విధించింది. రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరగా.. యావజ్జీవ కారాగారశిక్షగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని