1,082 మందికి శౌర్య పురస్కారాలు

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర సాయుధ బలగాలు, రాష్ట్రాల పోలీసు విభాగాలకు చెందిన 1,082 మందికి కేంద్ర ప్రభుత్వం శౌర్య పురస్కారాలు ప్రకటించింది. విధి నిర్వహణలో అసమాన

Published : 15 Aug 2022 05:26 IST

దిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర సాయుధ బలగాలు, రాష్ట్రాల పోలీసు విభాగాలకు చెందిన 1,082 మందికి కేంద్ర ప్రభుత్వం శౌర్య పురస్కారాలు ప్రకటించింది. విధి నిర్వహణలో అసమాన ప్రతిభ కనబరిచినవారికి, సాహసోపేతంగా వ్యవహరించినవారికి ఇచ్చే సేవా పతకాలూ ఇందులో ఉన్నాయి. 347 మందికి పోలీసు శౌర్య పతకాలు, 87 మందికి రాష్ట్రపతి పోలీసు పతకాలు, 648 మందికి ప్రతిభా పురస్కారాలు ఇవ్వను న్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. శౌర్య పతకాలు అందుకునే 347 మందిలో 204 మంది జమ్మూ-కశ్మీర్‌లో సేవలు అందించినవారే. మొత్తంమీద అత్యధికంగా 109 పతకాలు ‘కేంద్ర రిజర్వ్‌ పోలీసు దళం’ (సీఆర్పీఎఫ్‌) సిబ్బంది పొందారు. ఐటీబీపీకి చెందిన 20 మందికి వివిధ పతకాలు లభించాయి. రాష్ట్ర పోలీసులలో మహారాష్ట్రకు చెందినవారు 42 పురస్కారాలు పొందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని