భారీ ఉగ్రకుట్ర భగ్నం

స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసినట్లు పంజాబ్‌ పోలీసులు ఆదివారం ప్రకటించారు. ఈ మేరకు దిల్లీ పోలీసులతో కలిసి దేశ రాజధానిలోని గోయలా ఖుర్ద్‌ గ్రామంలో

Published : 15 Aug 2022 05:26 IST

నలుగురు ఉగ్రవాదులను అరెస్టుచేసిన పంజాబ్‌ పోలీసులు

చండీగఢ్‌: స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసినట్లు పంజాబ్‌ పోలీసులు ఆదివారం ప్రకటించారు. ఈ మేరకు దిల్లీ పోలీసులతో కలిసి దేశ రాజధానిలోని గోయలా ఖుర్ద్‌ గ్రామంలో సంయుక్త ఆపరేషన్‌ చేపట్టామని, పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ మద్దతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేశామన్నారు. దేశంలో శాంతి, సామరస్యాలకు ఆటంకం కలిగించేందుకు స్వాతంత్య్ర దినోత్సవానికి ముందే దాడులు చేయాలని వీరికి ఆదేశాలు అందినట్లు పేర్కొన్నారు. ‘‘స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో పంజాబ్‌ పోలీసులు దిల్లీ పోలీసుల సహాయంతో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. నలుగురిని అరెస్టుచేశారు’’ అని పంజాబ్‌ పోలీసులు ట్విటర్‌ వేదికగా తెలిపారు. అరెస్టుచేసిన వ్యక్తుల నుంచి మూడు గ్రెనేడ్లు, ఒక ఐఈడీ, రెండు 9 ఎంఎం పిస్తోళ్లు, 40 క్యాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పంజాబ్‌ డీజీపీ గౌరవ్‌ యాదవ్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

* స్వాతంత్య్ర దినోత్సవం రోజున మణిపుర్‌ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, భద్రతా బలగాలపై పేలుడు పదార్థాలతో దాడులకు పాల్పడేందుకు పన్నిన కుట్రను పోలీసులు ఆదివారం భగ్నం చేశారు. ఈ మేరకు నిషేధిత పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ)కి చెందిన ఏడుగురు సభ్యులను అరెస్టుచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని