నీతీశ్‌ హెలికాప్టర్‌ అత్యవసర ల్యాండింగ్‌

వాతావరణం అనుకూలించకపోవడంతో బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను శుక్రవారం గయలో అత్యవసరంగా దించారు. ఆయన రాష్ట్రంలోని ఔరంగాబాద్‌, జహానాబాద్‌,

Published : 20 Aug 2022 06:04 IST

పట్నా: వాతావరణం అనుకూలించకపోవడంతో బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను శుక్రవారం గయలో అత్యవసరంగా దించారు. ఆయన రాష్ట్రంలోని ఔరంగాబాద్‌, జహానాబాద్‌, గయ జిల్లాల్లోని కరవు ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే చేసేందుకు వెళ్లారు. తిరిగి రాజధాని పట్నాకు వెళుతున్న సమయంలో వాతావరణం ప్రతికూలంగా మారడంతో గుర్తించిన పైలట్‌ హెలికాప్టర్‌ను గయలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా కిందకు దించినట్లు మగధ రేంజి ఐజీ వినయ్‌ కుమార్‌ తెలిపారు. వాతావరణ పరిస్థితులు మెరుగు పడకపోవడంతో ముఖ్యమంత్రి రోడ్డు మార్గాన పట్నాకు చేరుకున్నట్లు చెప్పారు. బిహార్‌లో వర్షాభావంతో చాలాచోట్ల కరవు పరిస్థితులు నెలకొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని