హైవే నిర్మాణం కోసం మేడ వెనక్కి.. ఇంటిని పడగొట్టలేనంటున్న రైతు

‘ఆ ఇల్లు నా కలలకు ప్రతిరూపం. రూ.కోటిన్నర ఖర్చు పెట్టా. ఇపుడు మరో ఇల్లు కట్టుకోవడం నాకు ఇష్టం లేదు’ అంటున్నారు పంజాబ్‌కు చెందిన సుఖ్విందర్‌ సింగ్‌. ఈ రైతు ఇంటికి వచ్చిన కష్టం ఏమిటంటే.. దిల్లీ - అమృత్‌సర్‌ - కట్రా ఎక్స్‌ప్రెస్‌

Published : 21 Aug 2022 07:53 IST

సంగ్రూర్‌: ‘ఆ ఇల్లు నా కలలకు ప్రతిరూపం. రూ.కోటిన్నర ఖర్చు పెట్టా. ఇపుడు మరో ఇల్లు కట్టుకోవడం నాకు ఇష్టం లేదు’ అంటున్నారు పంజాబ్‌కు చెందిన సుఖ్విందర్‌ సింగ్‌. ఈ రైతు ఇంటికి వచ్చిన కష్టం ఏమిటంటే.. దిల్లీ - అమృత్‌సర్‌ - కట్రా ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణానికి అడ్డుగా ఉన్నందున, పొలంలో కట్టుకొన్న ఇంటిని తొలగించాల్సి వస్తోంది. సుఖ్విందర్‌ సింగ్‌ కట్టుకొన్న ఈ రెండంతస్తుల ఇల్లు సంగ్రూర్‌ పట్టణ సమీపంలోని రోషన్‌వాలా గ్రామంలో ఉంది. కేంద్రం చేపట్టిన భారత్‌మాల ప్రాజెక్టులో భాగంగా ఈ మార్గంలో ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణం జరుగుతోంది. ‘ఈ జాతీయ రహదారి నిర్మాణం పూర్తయితే దిల్లీ నుంచి పంజాబ్‌ మీదుగా జమ్మూ-కశ్మీర్‌కు వెళ్లే ప్రయాణికులకు వ్యయ ప్రయాసలతోపాటు సమయమూ ఆదా అవుతుంది’ అని పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి, ఆ ఇంటిని తొలగించాలని రైతుకు పరిహారం కూడా ఇచ్చారు. ఇంటిని పడగొట్టడం ఇష్టం లేని సుఖ్విందర్‌ దాన్ని ఓ 500 మీటర్ల మేర వెనక్కు జరిపే బృహత్తర కార్యక్రమాన్ని తలకు ఎత్తుకున్నారు. కార్మికులను పురమాయించి ఇప్పటికే 250 మీటర్లు వెనక్కు జరిపారు కూడా. ఇంటి కింద చక్రాల్లాంటివి అమర్చి క్రమక్రమంగా వెనక్కు జరుపుతూ పనులు కొనసాగిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని