అప్రమత్తంగా ఉండండి

కెనడాలో ‘విద్వేష నేరాలు’, ‘భారత వ్యతిరేక కార్యకలాపాలు’ పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి భారత పౌరులకు విదేశాంగ శాఖ హెచ్చరిక సూచనలు చేసింది. అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఇటీవల కెనడాలో జరిగిన ద్వేషపూరిత ఘటన

Published : 24 Sep 2022 05:14 IST

కెనడాలోని ప్రవాస భారతీయులకు కేంద్రం సూచన

దిల్లీ: కెనడాలో ‘విద్వేష నేరాలు’, ‘భారత వ్యతిరేక కార్యకలాపాలు’ పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి భారత పౌరులకు విదేశాంగ శాఖ హెచ్చరిక సూచనలు చేసింది. అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఇటీవల కెనడాలో జరిగిన ద్వేషపూరిత ఘటన గురించి ఉన్నతాధికారులకు సమాచారం అందించామని విదేశాంగ శాఖ పేర్కొంది. దీనిపై దర్యాప్తు చేయాలని కోరినట్లు తెలిపింది. సత్వరమే నిందితులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు వివరించింది. అయితే, ఇప్పటివరకు నిందితులను న్యాయస్థానం ఎదుటకు తీసుకురాలేకపోయారని వెల్లడించింది. ఈ నేపథ్యంలో పెరుగుతున్న నేరాలను దృష్టిలో పెట్టుకొని.. కెనడాలో ఉన్న భారత జాతీయులు, విద్యార్థులు, కెనడాకు ప్రయాణం చేయాలనుకుంటున్నవారు జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేసింది.

పేర్లు నమోదు చేసుకోండి

గత కొంతకాలంగా కెనడాలో విద్వేష నేరాలు గణనీయంగా పెరిగాయి. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం, ఓ వర్గం లక్ష్యంగా హింస వంటివి ఆ దేశంలో పెచ్చుమీరాయి. ఇటీవలే ఖలిస్థానీ వేర్పాటువాదులు టొరంటోలోని శ్రీ స్వామినారాయణ్‌ మందిర్‌, విష్ణు మందిర్‌పై దాడి చేశారు. ఆలయ గోడలపై భారత వ్యతిరేక నినాదాలు రాశారు. ఈ నేపథ్యంలోనే.. కెనడాలోని హిందూ ఆలయాలు, ప్రార్థనా స్థలాలపై దాడులు పెరుగుతున్నాయని ఆ దేశ ఎంపీ చంద్ర ఆర్య ఆందోళన వ్యక్తం చేశారు. విధ్వంసాన్ని ఖండిస్తూ పార్లమెంట్‌లో తన గళం విప్పారు. ఈ నేపథ్యంలోనే విదేశాంగ శాఖ తాజా అడ్వైజరీ జారీ చేసింది. వీటితో పాటు అక్కడి భారతీయులకు పలు సూచనలు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని