5 కోట్ల మంది హిందువులకు పితృతర్పణం

మహాలయ(సర్వపితృ) అమావాస్య నేపథ్యంలో ఆదివారం సుప్రసిద్ధ హరిద్వార్‌ క్షేత్రంలో ఓ ధార్మిక సంస్థ దేశ విభజన సందర్భంగాను, వివిధ అల్లర్లు, హింసాత్మక ఘటనల్లోనూ మరణించిన అయిదు

Published : 26 Sep 2022 04:58 IST

హరిద్వార్‌: మహాలయ(సర్వపితృ) అమావాస్య నేపథ్యంలో ఆదివారం సుప్రసిద్ధ హరిద్వార్‌ క్షేత్రంలో ఓ ధార్మిక సంస్థ దేశ విభజన సందర్భంగాను, వివిధ అల్లర్లు, హింసాత్మక ఘటనల్లోనూ మరణించిన అయిదు కోట్ల మంది హిందువులకు సామూహిక పితృతర్పణాన్ని నిర్వహించింది. నమామి గంగే ఘాట్‌లో అయోధ్య ఫౌండేషన్‌ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. వివిధ సందర్భాల్లో మరణించిన వీరందరికి అంతిమసంస్కారాలు జరగలేదని, వీరిని జాతి మరచిపోయిందని నిర్వాహకులు ఆవేదనతో తెలిపారు. దేశ విభజన సందర్భంగా పెద్దఎత్తున హిందూ భక్తులు తమ జీవితాలను త్యాగం చేశారని వివరించారు. కోల్‌కతా, గయ సహా దేశంలోని పలు పుణ్యక్షేత్రాలు, పవిత్ర నదుల వద్ద ప్రజలు పెద్ద ఎత్తున పితృతర్పణాలు అర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని