ఆన్‌లైన్‌ గేమింగ్‌ కంపెనీకి చెందిన రూ.68 కోట్లు జప్తు చేసిన ఈడీ

మొబైల్‌ గేములు నిర్వహిస్తున్న ఓ సంస్థకు చెందిన రూ.68 కోట్లకు పైబడిన డిపాజిట్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) స్తంభింపజేసింది. మనీలాండరింగ్‌ వ్యవహారంలో కోడా పేమెంట్స్‌

Published : 28 Sep 2022 05:05 IST

దిల్లీ: మొబైల్‌ గేములు నిర్వహిస్తున్న ఓ సంస్థకు చెందిన రూ.68 కోట్లకు పైబడిన డిపాజిట్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) స్తంభింపజేసింది. మనీలాండరింగ్‌ వ్యవహారంలో కోడా పేమెంట్స్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ (సీపీఐపీఎల్‌) సంస్థకు చెందిన మూడు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించినట్లు ఈడీ వెల్లడించింది. గరెనా ఫ్రీ ఫైర్‌, తీన్‌ పట్టీ గోల్డ్‌, కాల్‌ ఆఫ్‌ డ్యూటీ వంటి మొబైల్‌ గేములను నిర్వహించే ఆ సంస్థ అనధికారికంగా రూ.2,850 కోట్లను సేకరించిందని, అందులో రూ.2,265 కోట్లను దేశం వెలుపలికి (సింగపూర్‌కు) తరలించిందని తెలిపింది. మిగిలిన స్వల్ప మొత్తాన్ని సాధారణ లాభాలు చూపించేందుకు, పన్నులు చెల్లించేందుకు దేశంలో ఉంచిందని వివరించింది. కంపెనీపై పలు ఎఫ్‌ఐఆర్‌లు దాఖలైన నేపథ్యంలో మనీ లాండరింగ్‌ కేసు నమోదు చేసినట్లు ఈడీ చెప్పింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని