మాల్‌లో.. మీద చేతులు వేసి వేధించారు

సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా కోజికోడ్‌లోని ఓ మాల్‌కు వెళ్లిన తమతో కొందరు అభిమానులు అనుచితంగా ప్రవర్తించారని, మీద చేతులు వేసి వేధించారని కేరళ నటీమణులు ఇద్దరు

Published : 29 Sep 2022 06:50 IST

అభిమానుల తీరుపై ఇద్దరు కేరళ నటీమణుల ఆవేదన

కోజికోడ్‌ (కేరళ): సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా కోజికోడ్‌లోని ఓ మాల్‌కు వెళ్లిన తమతో కొందరు అభిమానులు అనుచితంగా ప్రవర్తించారని, మీద చేతులు వేసి వేధించారని కేరళ నటీమణులు ఇద్దరు చేసిన ఫిర్యాదు కలకలం రేపుతోంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనను ఇన్‌స్టాగ్రాం పోస్టు ద్వారా నటీమణులు వెల్లడించగా.. పోలీసులు తక్షణం స్పందించి విచారణ ప్రారంభించారు. సామాజిక మాధ్యమాల్లో, టీవీ ఛానళ్లలో బుధవారం రోజంతా చర్చలు కొనసాగాయి. ‘గుంపులోని ఓ వ్యక్తి నన్ను ఒడిసి పట్టుకున్నాడు. ఎక్కడ పట్టుకున్నాడో చెప్పాలంటే అసహ్యంగా ఉంది. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు’ అంటూ ఓ నటి ఆవేదన వ్యక్తం చేశారు. మరో నటి తన అనుభవాన్ని వివరిస్తూ.. ‘ఆ రద్దీలో వాళ్లను నియంత్రించడానికి సెక్యూరిటీ వాళ్లు చాలా కష్టపడ్డారు. భవిష్యత్తులో మాలా ఎవరూ ఇబ్బంది పడకుండా నిందితులపై చర్యలు తీసుకోవాలి’ అని కోరారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన కేరళ రాష్ట్ర మహిళా కమిషన్‌ చీఫ్‌ పి.సతీదేవి పోలీసులు వీలైనంత త్వరగా నిందితులను అరెస్టు చేయాలన్నారు. బాధితులు ఇద్దరిలో ఓ నటీమణి వాంగ్మూలం తీసుకొన్నామని, కొచ్చిలో ఉన్న మరో నటి వాంగ్మూలం కూడా తీసుకున్నాక ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామని సీనియర్‌ పోలీసు అధికారి మీడియాకు తెలిపారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts