రెండ్రోజుల్లో రూ.కోటి విలువ చేసే వజ్రాలు లభ్యం

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలో ఉన్న పన్నా వజ్రపు గనుల్లో కార్మికులకు రెండు రోజుల వ్యవధిలో 15 వజ్రాలు దొరికాయి. 35.86 క్యారెట్లు ఉన్న ఈ వజ్రాలు అధికారిక వేలంలో రూ.కోటి విలువ చేస్తాయని గనుల శాఖ ఇన్‌స్పెక్టర్‌ అనుపమ్‌సింగ్‌ శుక్రవారం వెల్లడించారు.

Published : 01 Oct 2022 06:05 IST

పన్నా: మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలో ఉన్న పన్నా వజ్రపు గనుల్లో కార్మికులకు రెండు రోజుల వ్యవధిలో 15 వజ్రాలు దొరికాయి. 35.86 క్యారెట్లు ఉన్న ఈ వజ్రాలు అధికారిక వేలంలో రూ.కోటి విలువ చేస్తాయని గనుల శాఖ ఇన్‌స్పెక్టర్‌ అనుపమ్‌సింగ్‌ శుక్రవారం వెల్లడించారు. ఆరుగురు సేకరించిన ఈ వజ్రాలను తమ కార్యాలయంలో భద్రపరిచామని, అక్టోబర్‌ 18 నుంచి వేలం వేస్తామన్నారు. ముడి వజ్రాలను వేలం వేశాక ప్రభుత్వ రాయితీ, పన్నులు మినహాయించుకొని మిగతా మొత్తం కార్మికులకు అందజేస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని