వంతెన ‘అడ్డు’తొలగించారు

తరచూ ఏర్పడుతున్న ట్రాఫిక్‌ సమస్యలను పరిష్కరించేందుకు ఉద్దేశించిన అభివృద్ధి పనుల్లో భాగంగా మహారాష్ట్రలోని పుణె నగరంలో ఒక పాత వంతెనను అధికారులు ఆదివారం తెల్లవారుజామున కూల్చేశారు. ఈ వంతెనను 90వ దశకం ప్రారంభంలో నిర్మించారు.

Published : 03 Oct 2022 05:11 IST

 పుణెలో ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారానికి కూల్చివేత

600 కేజీల పేలుడు పదార్థాల వినియోగం

పుణె: తరచూ ఏర్పడుతున్న ట్రాఫిక్‌ సమస్యలను పరిష్కరించేందుకు ఉద్దేశించిన అభివృద్ధి పనుల్లో భాగంగా మహారాష్ట్రలోని పుణె నగరంలో ఒక పాత వంతెనను అధికారులు ఆదివారం తెల్లవారుజామున కూల్చేశారు. ఈ వంతెనను 90వ దశకం ప్రారంభంలో నిర్మించారు. ముంబయి-బెంగళూరు జాతీయ రహాదారిపై చాందినీ చౌక్‌ వద్ద ఉన్న దీనిని కూల్చివేసేందుకు సుమారు 600 కేజీల పేలుడు పదార్థాలను వినియోగించినట్లు అధికారులు తెలిపారు. కూల్చివేత సమయంలో వాహనాలను వేరే మార్గంలో పంపారు. కూల్చివేత అనంతరం శిథిలాలను తొలగించి ఉదయం 10 గంటల సమయంలో వాహనాలను అనుమతించారు. ఇటీవల నొయిడాలో ట్విన్‌ టవర్స్‌ను కూల్చివేసిన ఎడిఫిస్‌ సంస్థే పుణెలోనూ వంతెన కూల్చివేత పనులు చేపట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని