కారుణ్య నియామకం.. హక్కు కాదు

కారుణ్య నియామకం.. ఉద్యోగి ఆకస్మిక మృతితో బాధిత కుటుంబం ఆటుపోట్లకు గురికాకుండా ఉండేందుకు ఓ ప్రత్యేక పరిస్థితుల్లో కల్పించిన సదుపాయం మాత్రమేనని, హక్కు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Updated : 04 Oct 2022 05:57 IST

ఓ ప్రత్యేక సదుపాయం మాత్రమే: సుప్రీంకోర్టు

దిల్లీ: కారుణ్య నియామకం.. ఉద్యోగి ఆకస్మిక మృతితో బాధిత కుటుంబం ఆటుపోట్లకు గురికాకుండా ఉండేందుకు ఓ ప్రత్యేక పరిస్థితుల్లో కల్పించిన సదుపాయం మాత్రమేనని, హక్కు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కారుణ్య నియామకం కోసం ఓ మహిళ చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ ట్రావెన్‌కోర్‌ లిమిటెడ్‌ను ఆదేశిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును, దాన్ని సమర్థిస్తూ కేరళ హైకోర్టు డివిజనల్‌ బెంచ్‌ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేస్తూ.. సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. మహిళ తండ్రి 1995లో ఉద్యోగంలో చనిపోయారని, ఆ సమయానికి కేరళ రాష్ట్ర ఆరోగ్య సేవల విభాగంలో తల్లి ఉద్యోగి అని.. అందుకే అప్పుడు ఆ కుటుంబాన్ని కారుణ్య నియామకానికి పరిగణనలోకి తీసుకోలేదన్న విషయాన్ని జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ కృష్ణమురారిల ధర్మాసనం ప్రస్తావించింది. ఆ సమయంలో మైనర్‌గా ఉన్న కుమార్తె 14 ఏళ్ల తర్వాత కారుణ్య నియామకం కోసం దరఖాస్తు చేయడంపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆకస్మిక సంక్షోభంతో బాధిత కుటుంబం ప్రభావితం కాకూడదన్నదే కారుణ్య నియామకాల వెనుక ఉద్దేశమని.. అది ఓ సదుపాయం మాత్రమేనని న్యాయమూర్తులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని