మానవ అక్రమ రవాణా కట్టడికి సమగ్ర చట్టం!

లైంగిక దోపిడీకి గురైన మహిళలు, పిల్లల పునరావాసానికి వీలు కల్పించేలా మనుషుల అక్రమ రవాణా నిరోధానికి సమగ్ర చట్టాన్ని తీసుకురావడంపై స్పందన తెలియజేయాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ‘ప్రజ్వల’ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ జె.బి.పార్దివాలాతో కూడిన ధర్మాసనం ఈ మేరకు స్పష్టంచేసింది.

Published : 04 Oct 2022 04:49 IST

కేంద్ర ప్రభుత్వ స్పందన కోరిన సుప్రీం కోర్టు

దిల్లీ: లైంగిక దోపిడీకి గురైన మహిళలు, పిల్లల పునరావాసానికి వీలు కల్పించేలా మనుషుల అక్రమ రవాణా నిరోధానికి సమగ్ర చట్టాన్ని తీసుకురావడంపై స్పందన తెలియజేయాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ‘ప్రజ్వల’ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ జె.బి.పార్దివాలాతో కూడిన ధర్మాసనం ఈ మేరకు స్పష్టంచేసింది. మహిళలు, పిల్లల అక్రమ రవాణాకు సంబంధించిన నేరాలను ఎదుర్కోవడానికి వ్యవస్థీకృత నేరాల దర్యాప్తు సంస్థ (ఓసీఐఏ)ను ఏర్పాటు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం 2015 డిసెంబరు 9న కేంద్ర ప్రభుత్వానికి నిర్దేశించిందని స్వచ్ఛంద సంస్థ తరఫు న్యాయవాది అపర్ణా భట్‌.. ధర్మాసనం దృష్టికి తెచ్చారు. మానవ అక్రమ రవాణా కోట్ల డాలర్ల వ్యాపారంగా మారిందని తెలిపారు. నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త విధానాలతో దీన్ని కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. సర్వోన్నత న్యాయస్థానం 2015లో ఇచ్చిన ఆదేశాలను ఎంత మేర అమలు చేశారన్నదానిపై కేంద్రం నుంచి నివేదిక తెప్పించుకోవాలని కోరారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం.. మానవ అక్రమ రవాణా నిరోధానికి సమగ్ర చట్టాన్ని రూపొందించే అంశంపై అక్టోబరు 31లోగా స్పందన తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని