దేశ ప్రజలందరికీ ఒకే విధమైన జనాభా నియంత్రణ విధానం

దేశంలో వివిధ వర్గాల్లో జనాభా అసమానతలపై రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌  అధినేత మోహన్‌ భాగవత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

Published : 07 Oct 2022 05:05 IST

ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌ వ్యాఖ్య

నాగ్‌పుర్‌: దేశంలో వివిధ వర్గాల్లో జనాభా అసమానతలపై రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ అధినేత మోహన్‌ భాగవత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అందరికీ వర్తించే ఒకే విధమైన ‘సమగ్ర జనాభా నియంత్రణ విధానం’ను మన దేశం రూపొందించుకోవాలని తెలిపారు. దీనివల్ల అల్పసంఖ్యాక వర్గాలకు ఎలాంటి ప్రమాదం ఉండదన్నారు. మహిళా సాధికారతకు పిలుపునిచ్చారు. నాగ్‌పుర్‌లోని రేష్మీబాగ్‌ మైదానంలో నిర్వహించిన దసరా ర్యాలీలో ఆయన ప్రసంగించారు. అంతర్జాతీయ అంశాలతో పాటు మాతృభాషలో విద్యాబోధన, హిందూ దేశం, స్వయంసమృద్ధి సాధించడం, శ్రీలంకకు భారత్‌ సహాయం తదితరాలపై గంటకుపైగా ఉపన్యసించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని