13 మందిని బలిగొన్న పులి చిక్కింది

మహారాష్ట్రలో 10 నెలల్లో 13 మందిని చంపి వణుకు పుట్టించిన పులిని ఎట్టకేలకు పట్టుకున్నారు. గడ్చిరోలి, చంద్రాపుర్‌ జిల్లాల్లో ఈ పులి డిసెంబరు నుంచి సంచరిస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమించింది. సీటీ-1గా పేరు పెట్టిన ఈ వ్యాఘ్రాన్ని ఎలాగైనా పట్టుకోవడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు.

Published : 14 Oct 2022 05:35 IST

గడ్చిరోలి: మహారాష్ట్రలో 10 నెలల్లో 13 మందిని చంపి వణుకు పుట్టించిన పులిని ఎట్టకేలకు పట్టుకున్నారు. గడ్చిరోలి, చంద్రాపుర్‌ జిల్లాల్లో ఈ పులి డిసెంబరు నుంచి సంచరిస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమించింది. సీటీ-1గా పేరు పెట్టిన ఈ వ్యాఘ్రాన్ని ఎలాగైనా పట్టుకోవడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే గురువారం వాడ్సా అటవీప్రాంతంలో దాని ఆచూకీని గుర్తించి మత్తుమందు ఇచ్చి పట్టుకున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.  పునరావాసం కోసం ఈ పులిని వాడ్సా రేంజ్‌ నుంచి 183 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగ్‌పుర్‌లోని గోరెవాడ రెస్క్యూ సెంటర్‌కు తరలించినట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని