Snake Bite: పాము కాటేసిందని.. కొరికి చంపేశాడు!

‘పాము కరిచింది.. పామును కరిచాడు’ ఇందులో ఏది నిజమనేగా మీ సందేహం. రెండూ వాక్యాలూ నిజమే.

Updated : 31 Oct 2022 10:46 IST

జశ్‌పుర్‌: ‘పాము కరిచింది.. పామును కరిచాడు’ ఇందులో ఏది నిజమనేగా మీ సందేహం. రెండూ వాక్యాలూ నిజమే. ఎందుకంటే ఛత్తీస్‌గఢ్‌లోని జశ్‌పుర్‌ జిల్లా పంద్రపుత్‌ గ్రామంలో పహాఢీ కోర్వా గిరిజన తెగకు చెందిన దీపక్‌ రామ్‌ (12) అనే బాలుడు తమ నివాసానికి సమీపంలో ఉన్న సోదరి ఇంటి వద్ద ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన ఓ పాము అతని చేతిపై కాటు వేసింది. దీంతో ఆగ్రహంతో ఉగిపోయిన దీపక్‌ పారిపోతున్న పామును వెంబడించి మరీ దొరకబుచ్చుకున్నాడు. వెంటనే గట్టిగా కొరికేశాడు. అనంతరం విషయం తెలియడంతో దీపక్‌ను అతని సోదరి ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. బాలుడికి ప్రాణాపాయం తప్పింది. అతను కరిచిన పాము మాత్రం మరణించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని