Gujarat Tragedy: ‘పట్టు’ విడవకుండా.. ప్రాణాలు నిలబెట్టుకున్న పాప

గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలో ఆదివారం తీగల వంతెన కూలిపోయిన దుర్ఘటనలో అహ్మదాబాద్‌కు చెందిన ఏడేళ్ల హర్షి అనే బాలిక మృత్యువు దగ్గరి దాకా వెళ్లి, చివరకు ప్రాణాలతో బయటపడింది.

Updated : 05 Nov 2022 08:51 IST

మోర్బీ ఘటనలో మృత్యుంజయురాలు హర్షి

మోర్బీ: గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలో ఆదివారం తీగల వంతెన కూలిపోయిన దుర్ఘటనలో అహ్మదాబాద్‌కు చెందిన ఏడేళ్ల హర్షి అనే బాలిక మృత్యువు దగ్గరి దాకా వెళ్లి, చివరకు ప్రాణాలతో బయటపడింది. తల్లిదండ్రులతో కలిసి వంతెన అందాలను వీక్షించేందుకు వెళ్లిన హర్షి.. తాము నిలబడి ఉన్నప్పుడే అది కూలిపోవడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైంది. అంతలోనే తన చేతికి అందిన ఓ తాడును గట్టిగా పట్టుకుంది. ఒంట్లో శక్తి కరిగిపోతున్నా పట్టువిడవలేదు. మృత్యువుకు ధైర్యంగా సవాలు విసిరింది. కొంతసేపటికి సహాయక చర్యల కోసం అక్కడికి చేరుకున్న ఓ పోలీసు హర్షిని రక్షించాడు. అయితే మోర్బీ దుర్ఘటనలో ఆమె తల్లిదండ్రులిద్దరూ కన్నుమూశారు. ప్రస్తుతం పాప అనాథగా మిగిలింది. అమ్మానాన్న ఎక్కడున్నారంటూ అమాయకంగా హర్షి అడుగుతుండటం అందరి మనసుల్ని కలచివేస్తోంది.

మోర్బీ మున్సిపల్‌ అధికారిపై వేటు

మోర్బీలో తీగల వంతెన కూలిపోయి 135 మంది దుర్మరణం పాలైన ఘటనకు సంబంధించి స్థానిక మున్సిపాలిటీ ముఖ్య అధికారి (సీవో) సందీప్‌సిన్హ్‌ జాలాను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. మోర్బీ జిల్లా కలెక్టర్‌ జి.టి.పాండ్యా శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని