తండ్రిని పోలీసులు కొట్టారని కోపం.. న్యాయం కోసం జడ్జీగా మారిన యువకుడు

తన కళ్ల ముందే తండ్రిని పోలీసులు కొట్టారు. అయినా ఏమీ చేయలేని పరిస్థితి ఆ నాలుగేళ్ల చిన్నారిది. ఆ సమయంలో తండ్రి చెప్పిన మాటలు అతడి మదిలో నాటుకుపోయాయి.

Published : 21 Nov 2022 07:52 IST

తన కళ్ల ముందే తండ్రిని పోలీసులు కొట్టారు. అయినా ఏమీ చేయలేని పరిస్థితి ఆ నాలుగేళ్ల చిన్నారిది. ఆ సమయంలో తండ్రి చెప్పిన మాటలు అతడి మదిలో నాటుకుపోయాయి. దాంతో అందరికీ న్యాయం చేయాలనుకున్నాడు. న్యాయమూర్తిగా ఎదిగాడు. ఇది బిహార్‌ నుంచి దిల్లీకి వలన వెళ్లిన కమలేశ్‌ విజయగాథ.

అది బిహార్‌లోని మారుమూల ప్రాంతం. 1992లో.. సహ్రాసా గ్రామానికి చెందిన చోలే బటూరే కుటుంబం దిల్లీకి వలస వెళ్లింది. పొట్ట కూటి కోసం ఆ ఇంటి పెద్ద దుకాణాన్ని నడిపేవాడు. తండ్రికి చేదోడుగా అదే దుకాణంలో నాలుగేళ్ల కమలేశ్‌ పని చేసేవాడు. ఎర్రకోట వెనకాల ఉన్న గుడిసెలన్నింటినీ ఖాళీ చేయించాలని వచ్చిన పోలీసులకు కమలేశ్‌ తండ్రికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘర్షణలో ఆయనపై ఓ పోలీసు చేయి చేసుకున్నాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న చిన్నారి కమలేశ్‌కు కోపం వచ్చినప్పటికీ ఏమి చేయలేకపోయాడు. పోలీసుల కంటే జడ్జీలే గొప్పవారు అని ఆ సమయంలో తండ్రి అన్న మాటలు తన మనసులో బలంగా నాటుకుపోయాయి. అప్పుడే తాను జడ్జి కావాలని నిర్ణయించుకున్నాడు. కష్టపడి చదువుకున్న కమలేశ్‌ బిహార్‌లో న్యాయమూర్తుల నియామకం కోసం నిర్వహించిన ‘జ్యుడిషియల్‌ సర్వీస్‌’ పరీక్షలో 64వ ర్యాంక్‌ సాధించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని