మన నేరన్యాయ వ్యవస్థే ఒక శిక్ష: సుప్రీం కోర్టు

మన నేరన్యాయ వ్యవస్థే ఒక శిక్షగా మారుతుంటుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

Published : 30 Nov 2022 03:54 IST

దిల్లీ: మన నేరన్యాయ వ్యవస్థే ఒక శిక్షగా మారుతుంటుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 2008లో పంజాబ్‌లో ఒకరిని ఆత్మహత్యకు పురిగొల్పారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురిని జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌, జస్టిస్‌ ఎ.ఎస్‌.ఓక్‌ల ధర్మాసనం ఈ నెల 24న విడుదల చేస్తూ ఈ వ్యాఖ్య చేసింది. దిగువకోర్టు తీర్పుపై అపీలును పంజాబ్‌-హరియాణా హైకోర్టు 2009 ఏప్రిల్‌లో కొట్టివేసింది. దీనిపై దాఖలైన అప్పీళ్లు 13 ఏళ్లుగా పెండింగులో ఉన్న విషయాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. మన నేరన్యాయ వ్యవస్థే శిక్ష అనడానికి ఈ కేసే ఉదాహరణ అని తెలిపింది. ‘మద్యం మత్తులో కళాశాలలో పాల్పడిన దుష్ప్రవర్తనకు గానూ విద్యార్థిని మందలించి, క్రమశిక్షణ చర్యల్లో భాగంగా తండ్రిని పిలిపించే ప్రయత్నం చేశారు. తండ్రి రాకపోయినా ఆ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అది దురదృష్టకర ఘటన’ అని పేర్కొంది. వేరే విద్యార్థులు తప్పుచేస్తే తన కుమారుడిని నిందించారని మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై ప్రిన్సిపాల్‌ సహా ముగ్గురిపై కేసు నమోదైంది. తనయుడిని కోల్పోయిన తండ్రి ఆవేదనను తాము అర్థం చేసుకుంటున్నామని ధర్మాసనం పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని