కర్ణాటక ‘మహా’ వివాదం

కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు వివాదం తీవ్రరూపం దాలుస్తోంది. మహారాష్ట్ర బస్సులపై కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు మంగళవారం రాళ్లు రువ్వారు.

Published : 07 Dec 2022 05:16 IST

ఇరు రాష్ట్రాల్లో వాహనాల ధ్వంసం

ఈనాడు, బెంగళూరు: కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు వివాదం తీవ్రరూపం దాలుస్తోంది. మహారాష్ట్ర బస్సులపై కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు మంగళవారం రాళ్లు రువ్వారు. మహారాష్ట్రలోని కొల్హాపుర, సాంగ్లి, పుణె జిల్లాల్లో కర్ణాటక బస్సులపై శివసేన కార్యకర్తలు దాడులు చేశారు. మహారాష్ట్ర మంత్రుల బృందం మంగళవారం బెళగావి పర్యటనను రద్దు చేసుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై సూచించటంపై శివసేన, మహారాష్ట్ర ఏకీకరణ సమితి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఆందోళనకు దిగారు. మహారాష్ట్ర బస్సులను కన్నడ సంఘాలు ధ్వంసం చేయటంపై ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌.. బొమ్మైతో ఫోన్‌లో మాట్లాడారు. ఆందోళనకారులపై చర్యలు తీసుకుంటామని, కేంద్ర హోంమంత్రితో చర్చిస్తానని బొమ్మై హామీ ఇచ్చినట్లు ఫడణవీస్‌ వెల్లడించారు. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ మాట్లాడుతూ 24 గంటల్లో మహారాష్ట్ర బస్సులపై దాడులు అడ్డుకోకపోతే తదనంతర పరిణామాలకు కర్ణాటక బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. పార్లమెంటు సమావేశాల్లో హోంమంత్రితో సమావేశమవుతానని ప్రకటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని