వన్యప్రాణుల బిల్లుకు ఆమోదం

రక్షిత ప్రాంతాలను మెరుగ్గా నిర్వహించడం, పశువులను మేపడం, తరలించడం తదితర కొన్ని కార్యకలాపాలను అనుమతించే లక్ష్యంతో రూపొందించిన వన్యప్రాణుల (సంరక్షణ) సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది.

Published : 09 Dec 2022 05:37 IST

దిల్లీ: రక్షిత ప్రాంతాలను మెరుగ్గా నిర్వహించడం, పశువులను మేపడం, తరలించడం తదితర కొన్ని కార్యకలాపాలను అనుమతించే లక్ష్యంతో రూపొందించిన వన్యప్రాణుల (సంరక్షణ) సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. గురువారం ఈ బిల్లును రాజ్యసభలో కేంద్ర పర్యావరణశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ ప్రవేశపెట్టారు. దీనికి సభ్యులు మూజువాణి ఓటుతో అంగీకారం తెలిపారు. ఆగస్టులో జరిగిన వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.

శిలాజేతర ఇంధనాలను ప్రోత్సహించే ఇంధన పరిరక్షణ (సవరణ) బిల్లు-2022ను కూడా గురువారం కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్‌.కె.సింగ్‌.. రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందింది. వాతావరణ మార్పులపై భారత్‌ కుదుర్చుకున్న అంతర్జాతీయ ఒప్పందాలకు అనుగుణంగా ఈ బిల్లులో సవరణలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని