National News: రూ.కోటి పన్ను కట్టాలంటూ రైతుకు జీఎస్‌టీ నోటీసులు

రాజస్థాన్‌లోని ఓ రైతుకు జీఎస్‌టీ అధికారులు షాక్‌ ఇచ్చారు. దిల్లీలో రూ.90 కోట్లకు పైగా లావాదేవీలు చేశాడంటూ నోటీసులు పంపించారు.

Updated : 17 Jan 2023 08:27 IST

రాజస్థాన్‌లోని ఓ రైతుకు జీఎస్‌టీ అధికారులు షాక్‌ ఇచ్చారు. దిల్లీలో రూ.90 కోట్లకు పైగా లావాదేవీలు చేశాడంటూ నోటీసులు పంపించారు. దీనికి గాను రూ.1,39,79,407 పన్నుగా కట్టాలని నోటీసులో పేర్కొన్నారు. దీంతో అతడు లబోదిబోమంటూ.. కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. జైసల్మేర్‌లోని సామ్‌ గ్రామానికి చెందిన అశోక్‌ కుమార్‌ అనే యువరైతుకు ఈ నోటీసులు అందాయి. ‘‘జనవరి 5న జీఎస్‌టీ విభాగం నుంచి నోటీసులు అందాయి. ఒక్కసారిగా భయపడ్డాను. దీనిపై సంబంధిత అధికారులను కలిశాను. దిల్లీలోని ఓ సంస్థ నా పాన్‌కార్డ్‌తో లావాదేవీలు చేస్తోందని తెలుసుకున్నాను. దీనిపై ఫిర్యాదు చేశాను. నా వ్యక్తిగత వివరాలను జీఎస్‌టీ అధికారులకు అందించాను’’ అని బాధితుడు తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని