Mamata Banerjee: రాష్ట్రాన్ని కించపరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు: మమత

Mamata Banerjee| కొందరు రాష్ట్రాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు.

Published : 08 Jan 2024 16:32 IST

కోల్‌కతా: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) అధికారులపై దాడిని సాకుగా చూపించి, శాంతిభద్రతలను ప్రశ్నిస్తూ కొందరు రాష్ట్రాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తున్నారని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Benerjee) మండిపడ్డారు. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. దేశంలోనే  కోల్‌కతా అత్యంత సురక్షితమైన నగరమని, నేషనల్ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) రికార్డులే ఈ అంశాన్ని నిరూపిస్తున్నాయన్నారు. కోల్‌కతాలో నిర్వహించిన ‘ స్టూడెంట్స్‌ వీక్‌’ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘‘ నాపై విమర్శలు చేసినా బాధపడను. కానీ, రాష్ట్రాన్ని ఎవరైనా కించపరిస్తే కచ్చితంగా ప్రతిఘటిస్తాను’’ అని పేర్కొన్నారు.

పశ్చిమబెంగాల్‌లో శుక్రవారం సోదాలు నిర్వహించేందుకు వెళ్లిన ఈడీ అధికారులపై అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన షేక్‌ షాజహాన్‌ అనుచరులు దాడికి పాల్పడటం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మారణాయుధాలతో భయభ్రాంతులకు గురిచేయడంతో పాటు వారి వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో కొందరు ప్రాణభయంతో పారిపోగా.. ముగ్గురు అధికారులు తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. ఈ చర్యను గవర్నర్‌ సి.వి.ఆనంద బోస్‌ తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్షపార్టీలు విమర్శలు గుప్పించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు