Anand Mahindra: ఒకవేళ ఈ ఎద్దు మాట్లాడగలిగితే..! ఆనంద్‌ మహీంద్రా ఏం చెప్పారంటే

ఓ ఎద్దు వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా ‘ఎక్స్‌’ వేదికగా పోస్ట్‌ చేశారు. ఎవరి నియంత్రణ లేకుండానే అది బండి లాగడం వంటి పనులు చేస్తోంది!

Published : 31 Jan 2024 02:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కాడిని ఎత్తుకోవడం మొదలు.. అప్పగించిన పనులను తనంతట తానుగా నిర్వహిస్తోన్న ఓ ఎద్దు వీడియో.. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) దృష్టిని ఆకర్షించింది. దీన్ని ‘ఎక్స్‌’ వేదికగా పోస్ట్‌ చేశారు. ‘‘ఒకవేళ రాము (ఎద్దు) మాట్లాడగలిగితే.. జీవితంలో సానుకూలంగా ఎలా ఉండాలనే దానిపై ప్రపంచంలోని వక్తలందరూ ఇచ్చే దానికంటే మంచి సలహా ఇస్తుందని పందెం కాస్తున్నా’’ అని రాసుకొచ్చారు.

49 ఏళ్ల మహిళతో 103 ఏళ్ల వృద్ధుడి వివాహం..

పంజాబ్‌లోని ఆశ్రమానికి చెందిన ‘రాము’.. ఎవరి నియంత్రణ లేకుండానే బండిని లాగుతూ.. అవసరమైతే రివర్స్‌ తీసుకుంటూ పశువుల దాణా, ఇతరత్రా సామగ్రిని సరైన చోటుకే చేర్చుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఇది నెట్టింట వైరల్‌గా మారింది. కృత్రిమ మేధ సాంకేతికత కంటే ‘రాము’ మెరుగ్గా పనిచేస్తుందని ఓ నెటిజన్‌ స్పందించారు. దీన్ని సంస్థలో నియమించుకోవాలని.. లేకపోతే మహీంద్రా ఆటో, టెంపో స్థానంలో వచ్చేస్తుందని సరదాగా సూచించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని