
ఆ రాష్ట్రంలో 80శాతం యూకే వేరియంట్ కేసులే!
చండీగఢ్: పంజాబ్‌లో కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల్లో ఎక్కువ శాతం యూకే వేరియంట్‌కు సంబంధించినవేనని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్ తెలిపారు. రాష్ట్రంలో కేసుల పెరుగుదలకు భారీగా జరుగుతున్న వివాహ వేడుకలు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, రైతుల ఆందోళనలే కారణమన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ మీడియాతో వెల్లడించారు.
‘పంజాబ్‌లో నమోదవుతున్న కొత్త కరోనా వైరస్ కేసుల్లో 80శాతం యూకే వేరియంట్‌కు సంబంధించినవే ఉంటున్నాయి. ఈ విషయం జన్యుక్రమ విశ్లేషణ ద్వారా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో కేసుల పెరుగుదలకు భారీగా వివాహ వేడుకలు జరగడం, ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించడం, రైతుల చేస్తున్న ఆందోళనలే కారణం’ అని హర్షవర్దన్ తెలిపారు. మరోవైపు, దేశంలో మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అత్యధికంగా కేసుల పెరుగుదల ఆందోళనకర పరిస్థితులకు దారి తీస్తోందని కేంద్రం మంగళవారం వెల్లడించిన విషయం తెలిసిందే.
కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషన్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘కరోనా మరణాలకు సంబంధించి పంజాబ్‌లోని పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. దేశంలో నమోదవుతున్న కేసుల్లో ఆ రాష్ట్రం వాటా మూడు శాతం ఉంటోంది. అదేవిధంగా మరణాల్లో 4.5శాతం నమోదవుతోంది’ అని తెలిపారు. పంజాబ్‌లో గడిచిన 24 గంటల్లో 61 మంది కరోనాతో మరణించారు. మరో 2,905 మంది కొత్తగా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 25వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Harsh Goenka: బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో గోయెంకా, శిందే.. అసలు విషయం ఏంటంటే..?
-
Sports News
IND vs ENG: భారత్ ఇంగ్లాండ్ ఐదో టెస్టులో నమోదైన రికార్డులివే
-
India News
Bullet Train: భారత్‌లో బుల్లెట్ రైలు ఎప్పుడొస్తుంది..? మరింత ఆలస్యమేనా..?
-
General News
CM KCR: తెలంగాణలో భూసమస్యల పరిష్కారానికి మండలాల్లో రెవెన్యూ సదస్సులు
-
Movies News
RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్‌పై శోభు యార్లగడ్డ ఫైర్
-
Business News
matrimony: ఐఏఎస్, ఐపీఎస్ కాదట.. మ్యాట్రీమొనీ సైట్లో వెతికింది వీరి కోసమేనట..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- IND vs ENG : మొత్తం మారిపోయింది
- China’s real estate crisis: పుచ్చకాయలకు ఇళ్లు.. సంక్షోభంలో చైనా రియల్ ఎస్టేట్ ..!
- Raghurama: రఘురామ ఇంట్లోకి ప్రవేశించే యత్నంలో దొరికిపోయిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్!
- Anveshi Jain: ‘సీసా’ తో షేక్ చేస్తున్న అన్వేషి జైన్.. హుషారు వెనక విషాదం ఇదీ!
- Double BedRooms: అమ్మకానికి.. రెండు పడక గదుల ఇళ్లు!
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- telugu movies: ఈ వారం థియేటర్/ ఓటీటీలో వచ్చే చిత్రాలివే!
- IND vs ENG : టెస్టు క్రికెట్ చరిత్రలో టాప్-4 భారీ లక్ష్య ఛేదనలు ఇవే..!
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!