Corona : 80 వేలకు దిగివచ్చిన కేసులు!

దేశంలో కరోనా ఉద్ధృతి క్రమంగా అదుపులోకి వస్తోంది. గత కొన్ని రోజులుగా రోజువారీ కేసులు

Updated : 13 Jun 2021 14:32 IST

దిల్లీ :దేశంలో కరోనా ఉద్ధృతి క్రమంగా అదుపులోకి వస్తోంది. గత కొన్ని రోజులుగా రోజువారీ కేసులు లక్షకు దిగువనే నమోదవుతుండటం ఊరట కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 80,834 కొత్త కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్‌ 2 తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో కేసుల నమోదుకావడం ఇదే తొలిసారి. ఇక క్రితం రోజుతో పోల్చితే మరణాల సంఖ్య కూడా కాస్త తగ్గింది. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం..

గడిచిన 24 గంటల్లో 3,303 మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,70,384కి చేరింది.

తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 2,94,39,989గా ఉంది.

గత కొన్ని రోజులుగా తాజా కేసుల కంటే రికవరీలే ఎక్కువగా నమోదవుతున్నాయి. తాజాగా 1,32,062 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి వరకూ కరోనాను జయించిన వారి సంఖ్య 2,80,43,446కి చేరింది.

ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 10,26,159కి చేరి.. ఆ రేటు 3.49 శాతానికి తగ్గింది.

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకూ  25,31,95,048 టీకా డోసులు అందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని