India needs Nurses: దేశంలో నర్సుల కొరత

దేశంలో 2024 నాటికి ఆస్పత్రుల్లో 43 లక్షల మంది వరకు నర్సుల అవసరం

Published : 03 Sep 2021 23:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో 2024 నాటికి ఆస్పత్రుల్లో దాదాపు 43 లక్షల మంది నర్సుల అవసరం ఉంటుందని నర్సుల సేవలకు సంబంధించిన ఓ సంస్థ తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం ప్రతి వెయ్యి మందికి ముగ్గురు నర్సులు అవసరం కాగా.. భారత్‌లో ఆ సంఖ్య ప్రస్తుతం 1.7 గానే ఉందని పేర్కొంది. ఈ రంగంలో పెట్టుబడులు, నర్సుల కొరతను తీర్చేందుకు తీసుకోవాల్సిన ప్రాముఖ్యతను సదరు సంస్థ వివరించింది. విద్య, శిక్షణ, గుర్తింపు కోసం పెట్టుబడులు పెట్టేందుకు సమగ్ర నిర్ణయాలు తీసుకోవాలని.. ప్రభుత్వ రంగంలో మరిన్ని అవకాశాలు కల్పించాలని అభిప్రాయపడింది. ఇక్కడ సరైన అవకాశాలు, వేతనాలు, గుర్తింపు లేకనే విదేశాలకు నర్సులు వెళ్తున్నారని పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని