Delhi: అనారోగ్యంతో ఉన్న భార్యను వారానికి ఒకసారి కలిసేందుకు సిసోదియాకు అనుమతి

దిల్లీ మద్యం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి  మనీష్‌ సిసోదియాకు కొంత ఊరట లభించింది. అనారోగ్యంతో ఉన్న తన భార్యను వారానికి ఒకసారి కలుసుకునేలా కోర్టు ఆయనకు అనుమతినిచ్చింది.

Published : 05 Feb 2024 18:27 IST

 

దిల్లీ: మద్యం కుంభకోణం(Liquor scam)  కేసులో ఏడాదిగా జైలు శిక్ష అనుభవిస్తున్న దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా(Manish Sisodia)కు కొంత ఉపశమనం లభించింది. అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను వారానికి ఒకసారి కలిసేందుకు దిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు సోమవారం ఆప్ నేతకు అనుమతినిచ్చింది. తన భార్యను వారానికోసారి కలిసేందుకు కస్టడీ పెరోల్‌(custody parole)కు అనుమతించాలని ఆయన అభ్యర్థించగా కోర్టు అందుకు అంగీకరించింది.  న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ ఫిబ్రవరి 2న దరఖాస్తుపై ఈడీకి నోటీసు జారీ చేస్తూ, మొదటి దరఖాస్తు తన రెగ్యులర్ బెయిల్ కోసం, రెండవది అనారోగ్యంతో ఉన్న భార్యను వారానికి రెండు రోజులు కలిసేందుకు కస్టడీ పెరోల్ కోసం అని పేర్కొన్నారు.

గత ఏడాది ఫిబ్రవరి 26న మనీష్ సిసోడియాను సీబీఐ(CBI) అరెస్టు చేసింది. మార్చి 9న ఈడీ(ED) అరెస్టు చేసింది. నిందితుడు మనీష్ సిసోడియా కార్యకలాపాల వల్ల దాదాపు రూ.622 కోట్ల కుంభకోణం జరిగిందని ఈడీ ఆరోపించింది. ఆయన ముందస్తు బెయిల్ దరఖాస్తులను హైకోర్టు, ట్రయల్ కోర్టు గత ఏడాది మే 30న తిరస్కరించాయి.

 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని