Michelle obama: మిచెల్‌ ఒబామాపై జావేద్‌ అక్తర్‌ ఆసక్తికర ట్వీట్‌!

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా సతీమణి మిచెల్‌ ఒబామాపై  ప్రముఖ బాలీవుడ్‌ గేయ రచయిత జావేద్‌ అక్తర్‌ ఆసక్తికర ట్వీట్‌ చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆమెను పోటీ చేయాల్సిందిగా కోరారు.

Published : 07 Oct 2022 01:36 IST

ముంబయి: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా సతీమణి మిచెల్‌ ఒబామాపై  ప్రముఖ బాలీవుడ్‌ గేయ రచయిత జావేద్‌ అక్తర్‌ ఆసక్తికర ట్వీట్‌ చేశారు. ఆమెను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా కోరారు. ‘‘ మేడం.. నేను యువకుడ్ని కాదు. మీ అభిమానిగా సరదా కోసం ఈ ట్వీట్‌ చెయ్యడం లేదు. 77 ఏళ్ల రచయితను నేను. ప్రతి భారతీయుడికీ నా పేరు తెలుసు అనుకుంటున్నా. నా మాటలను సీరియస్‌గా తీసుకోండి.  కేవలం అమెరికా మాత్రమే కాదు, మీరు శ్వేతసౌధంలో ఉండాలని యావత్‌ ప్రపంచం కోరుకుంటోంది. ఈ బాధ్యతను మీరు విస్మరించకూడదు.’’ అంటూ..మిచెల్‌ ఒబామా చేసిన ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు.

మిచెల్‌ ఒబామా తాను త్వరలో వెళ్లబోయే ‘ది లైట్‌ వి కేరీ’ అనే వినోదయాత్ర గురించి ట్వీట్‌ చేశారు. వాషింగ్టన్‌ డీసీ, ఫిలడేల్పియా, అట్లాంటా, చికాగో, శాన్‌ఫ్రాన్సిస్కో, లాస్‌ఏంజల్స్‌ నగరాల మీదుగా ఈ యాత్ర సాగనుంది. ఈ యాత్రలో భాగమయ్యేందుకు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ మిచెల్‌ ట్వీట్‌ చేశారు. దీనిపై స్పందించిన జావేద్‌ అక్తర్‌ ఆమెను శ్వేతసౌధానికి మళ్లీ వెళ్లాల్సిందిగా కోరారు. వరుసగా రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా ఎన్నికైన బరాక్‌ ఒబామా.. పదవీ కాలం పూర్తయిన తర్వాత జనవరి 2017లో శ్వేతసౌధాన్ని వీడారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని