JEE Advanced Results: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు నేడే 

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఐఐటీల్లో ప్రవేశానికి ఈ నెల 3న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు నిర్వహించిన

Updated : 15 Oct 2021 08:59 IST

దిల్లీ: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఐఐటీల్లో ప్రవేశానికి ఈ నెల 3న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఐఐటీ ఖరగ్‌పూర్‌ ఈరోజు ఉదయం 10గంటలకు ఫలితాలు విడుదల చేయనుంది. ర్యాంకుల ఆధారంగా దేశంలోని 23 ఐఐటీలు సహా 114 విద్యా సంస్థల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. మొత్తం 50వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను 20వేల మంది విద్యార్థులు రాశారు. రేపట్నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 25వరకు రిజిస్ట్రేషన్లు, 27న సీట్లు కేటాయింపు జరపనున్నారు. ఫలితాలను https://jeeadv.ac.in/వెబ్‌సైట్‌లో చూడవచ్చని అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని