Justin Trudeau : కెనడా ప్రధాని విమానంలో సాంకేతిక లోపం.. ఈ రాత్రికి భారత్‌లోనే బస!

జీ-20 సదస్సుకు కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో (Justin Trudea) హాజరైన విషయం తెలిసిందే. ఆయన ప్రయాణించనున్న విమానంలో (Plane) సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ రాత్రికి భారత్‌లోనే బస చేయనున్నారు. 

Published : 10 Sep 2023 22:55 IST

దిల్లీ : భారత దేశ రాజధాని దిల్లీలో నిర్వహించిన జీ-20 సదస్సుకు కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో (Justin Trudea) హాజరయ్యారు. సదస్సు ముగిసిన నేపథ్యంలో ఆయన తిరుగు ప్రయాణం కావాల్సి ఉంది. అయితే విమానంలో (Plane) సాంకేతిక లోపం తలెత్తడంతో కెనడా ప్రధానితో సహా ఆ దేశ ప్రతినిధులంతా ఈ రాత్రికి భారత్‌లోనే బస చేయనున్నారు. ‘మేము విమానాశ్రయానికి బయలుదేరిన సమయంలో సీఎఫ్‌సీ001 విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు కెనడియన్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌ ద్వారా సమాచారం అందింది. ఆ సమస్యను రాత్రి పూట పరిష్కరించడం సాధ్యం కాదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయ్యే వరకు మా బృందం భారత్‌లోనే ఉంటుందని’ కెనడా ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం విమానం రాత్రి 8 గంటలకు టేకాఫ్‌ కావాల్సి ఉంది. కాగా, జీ-20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ట్రూడో శుక్రవారం దిల్లీ చేరుకున్నారు. 

కెనడాలో ‘ఖలిస్థానీ’ నిరసనలు.. ప్రధాని ట్రూడో ఏమన్నారంటే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని