Kerala: భాజపా నేత హత్య కేసులో దోషులుగా 15 మంది..

Kerala: కేరళలో భాజపా నేత హత్య కేసులో నిషేధిత పీఎఫ్‌ఐ సంస్థకు 15 మంది దోషులుగా తేలారు. ఈ మేరకు అలప్పుళ కోర్టు శనివారం తీర్పు వెలువరించింది.

Published : 20 Jan 2024 16:40 IST

తిరువనంతపురం: కేరళ (Kerala)లో రెండేళ్ల క్రితం సంచలనం సృష్టించిన భాజపా నాయకుడి హత్య కేసులో స్థానిక కోర్టు శనివారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో 15 మందిని దోషులుగా నిర్ధారించింది. వీరికి సోమవారం (జనవరి 22న) శిక్ష ఖరారు చేయనుంది. వీరంతా నిషేధిత పీఎఫ్‌ఐ సంస్థకు చెందిన వారిగా గుర్తించారు.

2021 డిసెంబరు 19న అలప్పుళ (Alappuzha)లో భాజపా ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రంజిత్ శ్రీనివాసన్‌ను హత్య చేశారు. పీఎఫ్‌ఐ, ఎస్‌డీపీఐ కార్యకర్తలు అతని ఇంట్లోకి చొరబడి కుటుంబసభ్యుల ఎదుటే అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు కొందర్ని అరెస్టు చేశారు. దీనిపై విచారణ జరిపిన జిల్లా అదనపు సెషన్స్ కోర్టు.. ఈ కేసులో 15 మందిని దోషులుగా నిర్ధారించింది.

మయన్మార్‌ నుంచి వందల్లో సైనికులు.. కేంద్రాన్ని ఆశ్రయించిన మిజోరం

ఆ ఏడాది డిసెంబరు 18న ఎస్‌డీపీఐ నాయకుడు కేఎస్‌ షాన్ ఇంటికి తిరిగి వస్తుండగా ఒక ముఠా ఆయనను చంపేసింది. ఈ ఘటన జరిగిన కొద్ది గంటలకే రంజిత్‌ హత్య జరగడం అప్పట్లో తీవ్ర కలకలం సృష్టించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని