Konark Wheel: అతిరథులను స్వాగతించిన వేళ.. ఆకట్టుకున్న కోణార్క్‌ వీల్‌

భారత్‌ అధ్యక్షత జీ20 శిఖరాగ్ర సదస్సు(G20 Summit) జరుగుతోంది. ఈ సదస్సు నిర్వహిస్తోన్న వేదిక వద్ద కోణార్క్‌ చక్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

Updated : 09 Sep 2023 12:18 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో జీ20 శిఖరాగ్ర సదస్సు( G20 Summit) ప్రారంభమైంది. ఇందుకు ప్రగతి మైదాన్‌లోని భారత్‌ మండపం వేదికైంది. ఈ సదస్సు కోసం విచ్చేసిన ప్రపంచ దేశాల అధినేతలకు వేదిక వద్ద ప్రధాని మోదీ(PM Modi) స్వయంగా ఆహ్వానం పలికారు. వారికి స్వాగతం పలికే ప్రదేశంలో బ్యాగ్రౌండ్‌లో కోణార్క్‌ చక్రం(Konark Wheel) ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దేశ సంస్కృతిని ప్రతిబింబించే అనేక చిహ్నాలను ఈ మండపం వద్ద ఏర్పాటు చేశారు. వాటిల్లో ఈ చక్రం కూడా ఒకటి. ఈ చక్రం అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ దృష్టిని ఆకర్షించింది. ప్రధాని మోదీ ఆయనకు ఈ చక్రం ప్రాముఖ్యతను వివరించారు.  

G20 Summit: జీ20 సదస్సు.. లైవ్‌ అప్‌డేట్స్‌

కోణార్క్‌ చక్రాన్ని(Konark Wheel) 13వ శతాబ్దంలో నరసింహదేవ-1 పాలనలో నిర్మించారు. దీని భ్రమణం.. సమయం, పురోగతి, నిరంతర మార్పును సూచిస్తుంది. ఇది ప్రజాస్వామ్య సిద్ధాంతాలు, సమాజ పురోగతి కోసం నిబద్ధతకు గుర్తుగా నిలుస్తోంది. ఈ చక్రాన్ని ఏర్పాటు చేసిన ప్రదేశంలోనే మోదీ దేశాల అధినేతలకు స్వాగతం పలికారు. ఇక్కడే బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ను ఆత్మీయ హత్తుకొని స్వాగతించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని