Yogi Adityanath: 2024 కల్లా అయోధ్యలో రాముడు కొలువుతీరతాడు: యోగీ ఆదిత్యనాథ్‌

2024 కల్లా అయోధ్య (Ayodhya) రామమందిరంలో రాముడు కొలువుతీరతాడని ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh) సీఎం యోగి ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath) తెలిపారు. వచ్చే ఏడాది జనవరిలో జరిగే రాముడి విగ్రహ ప్రతిష్టా మహోత్సవానికి ప్రధాని మోదీ హాజరవుతారని చెప్పారు.

Published : 16 Jun 2023 23:52 IST

లఖ్‌నవూ: గత ప్రభుత్వాలు శ్రీరాముడి విగ్రహాన్ని టెంట్‌ల కింద ఉంచాయని ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh) సీఎం యోగి ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath) విమర్శించారు. 2024 కల్లా అయోధ్య (Ayodhya)లో నిర్మిస్తున్న గుడిలో రాముడు కొలువుతీరతాడని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని సోన్‌భద్రలో ₹414 కోట్ల విలువైన 217 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో రాష్ట్రంలో రామరాజ్యానికి పునాది పడిందని అన్నారు. 2024 జనవరిలో రామమందిరంలో రాముడి విగ్రహ ప్రతిష్టా మహోత్సవానికి ప్రధాని మోదీ హాజరవుతారని ఆదిత్యనాథ్‌ చెప్పారు. 

గత ప్రభుత్వాలు ఉత్తర్‌ప్రదేశ్‌లో గిరిజన ప్రజలను నిర్లక్ష్యం చేశాయని, భాజపా అధికారంలోకి వచ్చిన ఆరేళ్లలో పేద, గిరిజన ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు. అయోధ్యలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న రామాలయం తొలి అంతస్తు నిర్మాణం తుదిదశకు చేరుకుందని కొద్దిరోజుల క్రితం నిర్మాణ కమిటీ అధ్యక్షుడు నృపేంద్ర మిశ్ర తెలిపారు. మూడు అంతస్తులుగా నిర్మిస్తున్న ఆలయం పునాది పూర్తయ్యాక రాఫ్ట్‌, ప్లింత్‌ల నిర్మాణం.. రాజస్థాన్‌ నుంచి తెప్పించిన బన్సి పహార్‌పుర్‌ రాళ్ల అమరిక అత్యంత వేగంగా జరుగుతున్నాయని వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని