
Updated : 11 Apr 2021 14:51 IST
లులూ సంస్థల ఛైర్మన్‌కు తప్పిన ప్రమాదం!
కొచ్చి: దేశంలో అతిపెద్ద షాపింగ్ మాల్స్‌లో ఒకటైన లులూ గ్రూప్ సంస్థల ఛైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను సాంకేతిక లోపం కారణంగా కొచ్చిలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. చిత్తడి భూమిలో హెలికాప్టర్ దిగడంతో పెనుప్రమాదం తప్పింది. ల్యాండ్ అయిన సమయంలో హెలికాప్టర్‌లో అలీ దంపతులతో పాటు మరో ఏడుగురు ఉన్నారు. ల్యాండింగ్ తర్వాత వారందరినీ సమీపంలోని ప్రైవేట్ అసుపత్రికి తరలించారు. అందరూ సురక్షితంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. వారందరినీ ప్రస్తుతం వైద్య పర్యవేక్షణలో ఉంచినట్లు వెల్లడించారు.
ఇవీ చదవండి
Tags :