Amitabh Bachchan: అమితాబ్‌ ఇంటికి వెళ్లి రాఖీ కట్టిన సీఎం మమత

ముంబయిలో విపక్షాల భేటీకి విచ్చేసిన దీదీ బుధవారం సాయంత్రం బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమితాబ్‌ బచ్చన్‌ నివాసానికి వెళ్లారు.

Updated : 30 Aug 2023 20:17 IST

ముంబయి:  పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  ముంబయికి చేరుకున్నారు. ఆగస్టు 31, సెప్టెంబర్‌ 1 తేదీల్లో జరగనున్న విపక్ష కూటమి ‘ఇండియా’ కీలక భేటీలో పాల్గొనేందుకు బుధవారం నగరానికి చేరుకున్న ఆమె.. బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమితాబ్‌ బచ్చన్‌ను కలిశారు. రక్షాబంధన్‌ పర్వదినం వేళ జుహూలో ఉన్న ఆయన నివాసానికి వెళ్లిన దీదీ.. అమితాబ్‌కు రాఖీ కట్టారు. ముంబయి పర్యటన నేపథ్యంలో దీదీని అమితాబ్‌ తేనీటి విందుకు ఆహ్వానించినట్టు సమాచారం. అమితాబ్‌ కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించిన అనంతరం దీదీ మీడియాతో మాట్లాడారు.

అక్క సోదర వాత్సల్యం.. తమ్ముడికి రాఖీ కట్టి మరీ కిడ్నీ దానానికి సిద్ధమైంది!

అమితాబ్‌ నివాసానికి రావడం తనకు చాలా సంతోషంగా ఉందని సీఎం మమత అన్నారు.  ఆయను రాఖీ కట్టినట్టు వెల్లడించారు. అమితాబ్‌ కుటుంబం అంటే తనకు అమితమైన ఇష్టమన్న దీదీ.. ఆ కుటుంబం దేశానికి ఎంతో సేవ చేసిందని, దేశంలోనే నంబర్‌ వన్‌ అని వ్యాఖ్యానించారు. బెంగాల్‌లో దుర్గా పూజ, అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి వారిని ఆహ్వానించినట్టు తెలిపారు.  గతేడాది కోల్‌కతా అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌ ప్రారంభోత్సవానికి అమితాబ్‌ హాజరు కాగా.. సినీ పరిశ్రమలో ఆయన అందించిన సేవలను గుర్తించి కేంద్రం ఆయనకు భారతరత్న అవార్డుతో సత్కరించాలని దీదీ డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని