Ajit Doval: అజిత్‌ డోభాల్‌ ఇంటి వద్ద వ్యక్తి హల్‌చల్‌.. కారుతో దూసుకెళ్లేందుకు యత్నం

జాతీయ భద్రతా సలహాదారు(ఎన్‌ఎస్‌ఏ) అజిత్‌ డోభాల్ నివాసం వద్ద ఓ అపరిచిత వ్యక్తి హల్‌చల్‌ చేశాడు. డోభాల్‌ ఇంట్లోకి ఓ వ్యక్తి కారుతో దూసుకెళ్లేందుకు

Updated : 16 Feb 2022 12:53 IST

దిల్లీ: జాతీయ భద్రతా సలహాదారు(ఎన్‌ఎస్‌ఏ) అజిత్‌ డోభాల్ నివాసం వద్ద ఓ అపరిచిత వ్యక్తి హల్‌చల్‌ చేశాడు. డోభాల్‌ ఇంట్లోకి కారుతో దూసుకెళ్లేందుకు యత్నించాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది కారును అడ్డగించి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని విచారించగా.. తన శరీరంలో ఎవరో చిప్‌ పెట్టారని, వారే తనను కంట్రోల్‌ చేస్తున్నారని చెప్పాడు.

అయితే ఎంఆర్‌ఐ స్కాన్‌లో అతడి శరీరంలో ఎలాంటి చిప్‌ లేదని తేలడం గమనార్హం. అతడి మానసిక స్థితి సరిగ్గా లేదని ప్రాథమిక విచారణలో గుర్తించారు. బెంగళూరుకు చెందిన ఆ వ్యక్తి అద్దె కారులో డోభాల్‌ ఇంటికి వచ్చినట్లు తెలిసింది. ఘటన సమయంలో డోభాల్ ఇంట్లోనే ఉన్నారని దిల్లీ పోలీసులు తెలిపారు. తదుపరి విచారణ కోసం ఆ వ్యక్తిని దిల్లీ పోలీసులు ప్రత్యేక విభాగానికి అప్పగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని