Corona: ఇదొక భయంకరమైన మైలురాయి..!

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా 40లక్షలమంది ప్రాణాలను బలితీసుకుంది. దీనిపై ఐక్యరాజ్య సమితి(ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇదొక భయంకరమైన మైలురాయి అంటూ అభివర్ణించారు. అలాగే అంతర్జాతీయ టీకా ప్రణాళికను పట్టాలెక్కించాల్సిన అవసరాన్ని ఓ ప్రకటనలో గుర్తుచేశారు. 

Updated : 08 Jul 2021 18:59 IST

ఆందోళన వ్యక్తం చేసిన గుటెరస్

న్యూయార్క్: కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా 40లక్షలమంది ప్రాణాలను బలితీసుకుంది. దీనిపై ఐక్యరాజ్య సమితి(ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇదొక భయంకరమైన మైలురాయి అంటూ అభివర్ణించారు. అలాగే అంతర్జాతీయ టీకా ప్రణాళికను పట్టాలెక్కించాల్సిన అవసరాన్ని ఓ ప్రకటనలో గుర్తుచేశారు. 

‘కొవిడ్ కారణంగా 40 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మనం మహమ్మారిని ఓడించేందుకు చాలా దూరం వెళ్లాల్సిన అవసరాన్ని ఈ భయంకరమైన మైలురాయి గుర్తుచేస్తోంది. మరిన్ని టీకాలు, మరింత సమానత్వంతో మనం వేగంగా కదలాలి’ అని ట్విటర్ వేదికగా గుటెరస్‌ ప్రపంచ దేశాలను అప్రమత్తం చేశారు. కొవిడ్ సృష్టించిన విలయాన్ని చాలా మంది అనుభవించారని ఆవేదన చెందిన ఆయన.. మృతులకు  సంతాపం వ్యక్తం చేశారు. ‘కరోనా టీకా మనముందున్న ఆశాకిరణం. టీకా పంపిణీ వేగం కంటే వైరస్ వేగం ఎక్కువగా ఉంది. ఈ మహమ్మారి దావానలాన్ని అడ్డుకోకపోతే..మరెందరో ప్రాణాలకు ముప్పు ఉన్నట్లే’ అంటూ ఓ ప్రకటనలో హెచ్చరించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని