China: జిన్‌పింగ్‌ మెచ్చిన కమాండర్‌

భారత్‌తో సరిహద్దుల బాధ్యతలను చూసే చైనాకు చెందిన పీపుల్స్‌ లిబరేషన్ ఆర్మీ పశ్చిమ థియేటర్‌ కమాండ్‌ అధిపతికి పదోన్నతి లభించింది.

Published : 07 Jul 2021 13:27 IST

 షూ క్విలియాంగ్‌ పదోన్నతి

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌తో సరిహద్దుల బాధ్యతలను చూసే చైనాకు చెందిన పీపుల్స్‌ లిబరేషన్ ఆర్మీ పశ్చిమ థియేటర్‌ కమాండ్‌ అధిపతికి పదోన్నతి లభించింది. గతేడాది ఈ కమాండ్‌ గ్రౌండ్‌ ఫోర్స్‌ బాధ్యతలను షూ క్విలియాంగ్‌ స్వీకరించారు. అప్పటి నుంచి ఇరు దేశాల బలగాల మధ్య తరచూ ఘర్షణలు చోటు చేసుకొంటూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా పదోన్నతి లభించడం విశేషం. గత నెల నుంచి ఆయన పశ్చిమ థియేటర్‌ కమాండ్‌ మొత్తం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇటీవల వరకు ఆ థియేటర్‌ కమాండ్‌ బాధ్యతలు చూసిన ఝాంగ్‌ భవిష్యత్తుపై విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భారత్‌తో ఘర్షణలు మొదలైనప్పటి నుంచి ఈ థియేటర్‌కు ముగ్గురు కమాండర్లు మారారు.

తొలుత 2017 నుంచి ఇక్కడ బాధ్యతలు నిర్వహించిన ఝావో ఝాంగ్‌క్వీని గత డిసెంబర్‌లో పదవీ విరమణ చేశారు. ఆ స్థానంలో జనరల్‌ ఝాంగ్‌ వచ్చారు. ఆ తర్వాత కమాండ్‌ బాధ్యతలను షూ క్విలియంగ్‌కు కట్టబెట్టి జనరల్‌ స్థాయికి ప్రమోట్‌ చేశారు. వాస్తవానికి ఈ పరిణామం ఆసక్తికరమైంది. 2012లో షీజిన్‌ పింగ్‌ అధికారం చేపట్టిన తర్వాత జనరల్‌ స్థాయికి పదోన్నతి లభించిన పిన్నవయస్కుడు షూ క్విలియాంగ్‌ మాత్రమే. సోమవారం బీజింగ్‌లో జరిగిన ఒక వేడుకలో అధ్యక్షుడు షీజిన్‌పింగ్‌ ఈ ధ్రువీకరణను అందజేశారు. వాస్తవానికి కొన్ని నెలల నుంచి భారత్‌-చైనా మధ్య కమాండర్‌ స్థాయి అధికారుల చర్చల్లో పురోగతి నిలిచిపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని