Nitish Kumar: తెరపైకి మళ్లీ ‘ప్రత్యేక హోదా’.. రూ.2.50లక్షల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు!

రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని బిహార్‌ ప్రభుత్వం మళ్లీ తెరపైకి తెచ్చింది. ఇందుకు సంబంధించిన నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Published : 22 Nov 2023 23:01 IST

పట్నా: దేశవ్యాప్తంగా ప్రత్యేక హోదా కావాలంటూ పలు రాష్ట్రాలు ఎంతోకాలంగా డిమాండు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బిహార్‌ మరోసారి ఈ విషయాన్ని తెరపైకి తీసుకువచ్చింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఎంతోకాలంగా ప్రయత్నాలు చేస్తున్న నీతీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని కేబినెట్‌.. తాజాగా ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలను కేబినెట్‌ సమావేశం ముగిసిన వెంటనే నీతీశ్‌ కుమార్‌ స్వయంగా మీడియాకు వెల్లడించారు.

‘బిహార్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని కేంద్రాన్ని అభ్యర్థిస్తూ తీర్మానానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది’ అని బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ తెలిపారు. ఇటీవల చేపట్టిన కుల గణన ఆధారంగా తాజాగా ఈ డిమాండ్‌ అవసరమైందన్నారు. వెనకబడిన కులాల జనాభా పెరగడం వల్ల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల కోటాను 50 నుంచి 65శాతానికి పెంచాల్సి వచ్చిందని చెప్పారు. సర్వే ప్రకారం 94లక్షల కుటుంబాలు పేదరికంలో ఉన్నట్లు తేలిందని.. వీరి ప్రయోజనం కోసం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను సిద్ధం చేస్తున్నామన్నారు.

డబ్బులు తిరిగిచ్చేసిన ఓటర్‌.. వివాదంలో రాజస్థాన్‌ మంత్రి..!

రాష్ట్రంలో 39లక్షల నిరుపేద కుటుంబాలకు పక్కా ఇళ్ల నిర్మాణం, ఇందుకోసం కుటుంబానికి రూ.1.20లక్షల ఆర్థిక సహాయం చేస్తామని నీతీశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఒక్కో పేద కుటుంబంలో ఒక్కొక్కరికి పలు దఫాల్లో రూ.2లక్షల ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. ఇటువంటి కార్యక్రమాల అమలు కోసం రూ.2.50 లక్షల కోట్లు ఖర్చుచేయనున్నామని.. వచ్చే ఐదేళ్ల కాలంలో వీటిని పూర్తిచేయాలని డెడ్‌లైన్‌ పెట్టుకున్నామని బిహార్‌ ముఖ్యమంత్రి వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు