డబ్బులు తిరిగిచ్చేసిన ఓటర్‌.. వివాదంలో రాజస్థాన్‌ మంత్రి..!

ఎన్నికల ముందు రాజస్థాన్(Rajasthan) మంత్రి ఒకరు వివాదంలో చిక్కుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?

Published : 22 Nov 2023 17:31 IST

కోటా: రాజస్థాన్‌(Rajasthan)లో ఈ వారం చివర్లో అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ జరగనుంది. ఈ తరుణంలో రాజస్థాన్‌ మంత్రి శాంతి ధరివాల్(Shanti Dhariwal) చిక్కుల్లో పడ్డారు. మంత్రికి ఒక మహిళ డబ్బు తిరిగి ఇచ్చేస్తున్నట్టుగా ఉన్న దృశ్యాలు వైరల్ కావడంతో ఆయన వివాదంలో పడ్డారు. వాటిని ఉద్దేశించి ప్రధాని మోదీ కూడా విమర్శలు చేశారు.

ఒక వీడియో క్లిప్‌లో మహిళ ఒకరు మాట్లాడుతూ.. భయ్యా వచ్చి రూ.25 వేలు ఇచ్చారని మంత్రితో చెప్పారు. దాంతో మంత్రి అనుచరుడు ఒకరు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ఈ విషయం ఎందుకు చెప్తున్నావంటూ ప్రశ్నించారు. ఈ మేరకు మీడియా కథనాలు వెల్లడించాయి.  ఈ వీడియో వైరల్‌ కావడంతో.. ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో మంత్రిపై విమర్శలు చేశారు.  కళంకిత నేత చర్యలను దేశం మొత్తం చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘డబ్బుతో ఒక తల్లిని ప్రలోభపెట్టి, ఓటు కొనేందుకు ప్రయత్నించారు. ఈ డబ్బును వెనక్కి ఇచ్చి, ఆయనకు గట్టి సమాధానం ఇచ్చిన ఆ మహిళకు నా అభినందనలు’ అని మోదీ స్పందించారు.

అయితే ఆ తర్వాత మహిళకు సంబంధించిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది. అది ఓటు కోసం ఇచ్చిన డబ్బు కాదని ఆమె పేర్కొనడం గమనార్హం. ఆలయంలో విగ్రహాలు కొనుగోలు చేసేందుకు రూ.50 వేలు అవసరం ఉందని,  వారు రూ.25 వేలే ఇచ్చారని వెల్లడించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని