Reservation quota: బిహార్‌ కీలక నిర్ణయం.. రిజర్వేషన్లు 65 శాతానికి పెంచాలని ప్రతిపాదన!

బిహార్‌లో ప్రస్తుతమున్న 50శాతం రిజర్వేషన్లను 65శాతానికి పెంచాలని ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ ప్రతిపాదించారు.

Published : 07 Nov 2023 17:18 IST

పట్నా: రిజర్వేషన్లకు సంబంధించి బిహార్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రిజర్వేషన్లను 65శాతానికి పెంచాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు 50శాతం ఉండగా.. తాజాగా వాటిని 65శాతానికి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థికంగా బలహీనవర్గాలకు (EWS)కు చెందిన వారికి న్యాయ సర్వీసులు, ప్రభుత్వ న్యాయ కళాశాలలు, యూనివర్సిటీల్లో 10శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నట్టు నీతీశ్‌ ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే.

తాజా ప్రతిపాదనల ప్రకారం, ఎస్సీలకు 20శాతం రిజర్వేషన్‌ లభిస్తుంది. ప్రస్తుతం ఓబీసీ, ఈబీసీలు కలిపి 30శాతం ఉండగా.. తాజా పెంపుతో అవి 43శాతం కానున్నాయి. మరోవైపు ఎస్టీలకు 2శాతాన్ని ప్రతిపాదించారు. దీంతో రాష్ట్రంలో రిజర్వేషన్లు 65శాతానికి చేరుకుంటాయి. కులగణనకు సంబంధించిన నివేదికను బిహార్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కొన్ని గంటల్లోనే ప్రభుత్వం ఈ రిజర్వేషన్ల పెంపు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని