Agniveer recruitment: ఆర్మీ అగ్నివీరుల రిక్రూట్‌మెంట్‌లో కీలక మార్పు
Agniveer recruitment process: అగ్నివీరుల నియామక ప్రక్రియలో ఆర్మీ కీలక మార్పు చేసింది. తొలుత ఆన్‌లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌కు హాజరయ్యాక ఫిజికల్, మెడికల్ టెస్టులు నిర్వహించనున్నారు.
దిల్లీ: కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్ కింద నిర్వహిస్తున్న అగ్నివీరుల (Agniveer recruitment) నియామక ప్రక్రియలో ఆర్మీ (Army) కీలక మార్పు చేసింది. ఆర్మీలో చేరాలనుకునే వారికి తొలుత ఆన్‌లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేన్ (CEE) నిర్వహించాలని నిర్ణయించింది. ఆ తర్వాతే ఫిట్‌నెస్, మెడికల్ టెస్టులు నిర్వహించనున్నారు. త్వరలో దీనికి సంబంధించి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం ఆగ్నివీరుల ఎంపికలో తొలుత ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్టు నిర్వహిస్తున్నారు. వీటిలో అర్హత సాధించిన వారు సీఈఈకి హాజరు కావాల్సి ఉంటుంది. ఇకపై తొలుత సీఈఈని నిర్వహించనున్నారు. దీనివల్ల రిక్రూట్‌మెంట్‌లో భారీ రద్దీలను తగ్గించేందుకు వీలు పడనుంది. స్క్రీనింగ్ ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు, ప్రయాణ ఇబ్బందులను తగ్గించడానికి వీలుపడుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా 200 కేంద్రాల్లో ఏప్రిల్‌లో తొలి విడత సీఈఈ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2023-24 రిక్రూట్‌మెంట్‌లో ఆర్మీలో చేరబోయే 40 వేల మందికి ఈ ప్రక్రియ వర్తించనుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Zelensky: వరదలో కొట్టుకొస్తున్న మందుపాతరలు.. ఆ డ్యామ్ ఓ టైం బాంబ్..!
-
World News
Covid-19: దీర్ఘకాలిక కొవిడ్.. క్యాన్సర్ కంటే ప్రమాదం..: తాజా అధ్యయనంలో వెల్లడి
-
India News
కెనడాలో భారతీయ విద్యార్థుల బహిష్కరణ ముప్పు.. స్పందించిన జై శంకర్
-
General News
Avinash Reddy: వివేకా హత్యకేసులో 8వ నిందితుడిగా అవినాష్‌రెడ్డి: సీబీఐ
-
Movies News
ott movies: ఈ వారం ఓటీటీలో 17 సినిమాలు/వెబ్‌సిరీస్‌లు
-
India News
Air India: విమానం రష్యాకు మళ్లించిన ఘటన.. ప్రయాణికులకు ఎయిరిండియా ఆఫర్